Mars Transit 2023: కుజ సంచారం 2023.. మే 10 నుంచి ఈ 4 రాశుల వారికి రాజయోగం! డబ్బే డబ్బు
గ్రహాల రారాజుగా భావించే కుజుడు 2023 మార్చి 13న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. 2023 మే 9 వరకు మిధున రాశిలోనే సంచరించనుండగా... 2023 మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీని వలన కొన్ని రాశులకు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
Mangal Rashi Parivartan 2023: జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. అంగారకుడిని (కుజుడు) గ్రహాల రారాజు అంటారు. 2023 మార్చి 13న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. 2023 మే 9 వరకు మిధున రాశిలోనే ఉండనున్నాడు. 2023 మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ కుజ సంచార సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. కుజ సంచారం 2023 (Magal Gochar 2023) ఎవరికి శుభ ఫలితాలను ఇస్తుందో ఈరోజు తెలుసుకుందాం.
మీన రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశికి అంగారకుడి సంచారం అనుకూల ఫలితాలను తెస్తుంది. ఈ కాలంలో పురోగతిని పొందుతారు. మీరు విదేశాలలో చదువుకోవాలని చూస్తున్నట్లయితే.. విజయం సాధిస్తారు. అంతేకాదు చాలా రోజులుగా కోర్టులో ఉన్న కేసుల్లో విజయం సాధిస్తారు. అయితే విద్యార్థులు తమ చదువులకు సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కుంభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి అంగారక సంచార శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో కుంభ రాశి వారి శత్రువులు ఓడిపోతారు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. అయితే ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డబ్బులు కూడా వస్తాయి. ఈ సమయంలో వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి అంగారక సంచారం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తులు కొత్త సంపదను పొందుతారు. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం ఉంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి పొందవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: MS Dhoni Record: అరుదైన రికార్డుకు చేరువలో ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కాలేదు! జడేజా ప్రత్యేక సందేశం
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వ్యక్తులు అంగారక సంచారం కారణంగా శుభ ప్రభావాన్ని పొందుతారు. అంగారకుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశం ఉంది. ఎవరైనా కొత్త ప్రణాళికతో పనిచేస్తే.. ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. మీరు కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. అయితే చర్చకు దూరంగా ఉండండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి