MS Dhoni will Play 200th Match As Chennai Super Kings Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు చెన్నై, రాజస్థాన్ జట్లు రెండు విజయాలతో 4 పాయింట్స్ ఖాతాలో వేసుకుని సమవుజ్జీగా నిలిచాయి. అయితే నెట్ రన్‌రేట్ ఆధారంగా రాజస్థాన్ పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇదో స్థానంలో చెన్నై కొనసాగుతోంది.
ఈ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓ అరుదైన రికార్డును (MS Dhoni IPL Captain Record) నెలకొల్పనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ప్రాంచైజీకి అత్యధిక మ్యాచులకు సారథ్యం వహించిన ఆటగాడిగా నిలవనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 200 మ్యాచ్‌లకు ధోనీ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ధోనీ మొత్తంగా 237 మ్యాచ్‌లు ఆడాడు. అందులో మహీ 213 మ్యాచులకు కెప్టెన్‌గా ఉన్నాడు. చెన్నై కాకుండా ధోనీ క్యాష్ రిచ్ లీగ్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తిరుగులేని జట్టుగా ఆవిర్భవించింది. ఐపీఎల్‌లో సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ (5 ఐపీఎల్ టైటిల్స్) తరువాత అత్యధికంగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు చెన్నై. ధోనీ సారథ్యంలో ఇప్పటివరకు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. నాలుగుసార్లు (2010, 2011, 2018, 2021) టైటిల్స్ గెలుచుకుంది. 5 సార్లు ఫైనల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఐపీఎల్‌లో 5000 పరుగులు చేసిన 5వ భారత బ్యాటర్‌గా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ధోనీ ప్రస్తుతం 237 మ్యాచ్‌ల్లో 5004 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో స్థానంలో ధోనీ (4,482) ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 4,881 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా స్పదింస్తూ... 'ధోనీ ఐపీఎల్ మాత్రమే కాదు భారత క్రికెట్‌కు లెజెండ్. రాజస్థాన్ గేమ్‌లో గెలిచి అతనికి బహుమతి ఇస్తాం' అని తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి