Gupt Navratri 2023: నవరాత్రి అంటే తొమ్మిది పవిత్ర రాత్రులు అని అర్థం. ఈరోజుల్లో దుర్గామాతను పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి. అవే చైత్ర, శారద, మాఘ మరియు ఆషాఢ నవరాత్రులు. ఇందులో మాఘ, ఆషాఢ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. అయితే మాఘ మాసంలో నదీ స్నానమాచరించి శ్రీమహావిష్ణువును పూజించి.. మీ శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. సాధారణంగా మాఘ గుప్త నవరాత్రులు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వస్తాయి. . తంత్ర సాధనకు గుప్త నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. కొత్త సంవత్సరం 2023లో మాఘ గుప్త నవరాత్రుల తేదీ, శుభ సమయం మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేదీ మరియు శుభముహూర్తం


మాఘ గుప్త నవరాత్రులు 22 జనవరి 2023 నుండి ప్రారంభమై.. జనవరి 30న ముగుస్తాయి. ఈ నవరాత్రులు మాఘ మాస శుక్ల పక్షం ప్రతిపద తిథి నుండి నవమి వరకు ఉంటుంది. దుర్గామాత యెుక్క ఆరాధకులు తొమ్మది రోజులపాటు రహస్య మార్గంలో సాధన చేస్తారు. పంచాంగం ప్రకారం, మాఘ మాసపు శుక్ల పక్ష ప్రతిపద తిథి జనవరి 22, 2023న తెల్లవారుజామున 02:22 గంటలకు ప్రారంభమై జనవరి 22న రాత్రి 10:27 గంటలకు ముగుస్తుంది.


నవరాత్రి సమయంలో ఘటస్థాపన  చేస్తారు. ఈ రోజు నుంచి దుర్గాదేవిని 9 రకాలుగా పూజిస్తారు. నవరాత్రి తొలి రోజు నీరు లేదా ముడి బియ్యంతో నిండిన కలశాన్ని , కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి దుర్గాదేవిని ఆరాధించే స్థలంలో ఉంచుతారు. అనంతరం తల్లికి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు.  ఘటస్థాపన ముహూర్తం - ఉదయం 10:04 - 10:51 (22 జనవరి 2023). ఘటస్థాపన అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నం 12:17 - 01:00 (22 జనవరి 2022)


నవరాత్రి పూజా విధానం


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గుప్త నవరాత్రుల సమయంలో మీ డబ్బు రెట్టింపు అవ్వాలంటే లక్ష్మీదేవికి తామర పువ్వును సమర్పించండి. రోజువారీ పూజ సమయంలో దుర్గామాతకు అలంకరణ సామాగ్రిని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు అఖండ సౌభాగ్యం దక్కుతుంది మరియు జీవితంలో దేనికీ లోటు ఉండదు.


గుప్త నవరాత్రి విశిష్టత


గుప్త నవరాత్రులు ప్రత్యేక కోరికల నెరవేర్పు కోసం మరియు విజయాలు సాధించడం కోసం ప్రత్యేకంగా జరుపుకుంటారు. గృహస్థులు ఈ నవరాత్రులలో సాత్విక్ దేవిని మాత్రమే పూజించాలి. తామసిక్ పూజను తాంత్రికులు మరియు అఘోరీలు మాత్రమే చేస్తారు. గుప్త నవరాత్రుల ధ్యాన కాలంలో తపస్సు, కర్మలు, ధ్యానం మొదలైన వాటిని రహస్య మార్గంలో పఠించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.


Also Read: Mars Margi 2023: జనవరి 13న కుజుడి కదలికలో మార్పు.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.