Maha Lakshmi Favorite Zodiac In Telugu: హిందూ పురాణాల ప్రకారం, ప్రతి శుక్ర, సోమ వారాలు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజుల్లో అమ్మవారును పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని హిందువు నమ్మకం. అయితే ఈ రోజు కొన్ని రాశులవారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి కూడా విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రమాదాల బారిన పడకుండా కూడా లక్ష్మీదేవి కాపాడుతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏయే రాశులవారు తప్పకుండా శుక్ర, సోమ వారాలు లక్ష్మీదేవిని పూజించాలో, ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి:
వృషభ రాశివారికి ఎల్లప్పుడూ లక్ష్మీదేశి అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి కొన్ని ఈ వృషభ రాశివారికి సంపదకు, ఆర్థిక ప్రయోజనాలకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆస్తులు కూడా సులభంగా సంపాదిస్తారు. అంతేకాకుండా వీరికి సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. వీరికి కృషికి తగ్గ ప్రతి ఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు ప్రారంభించిన విజయాలు సాధిస్తారు. 


మిథున రాశి:
లక్ష్మీదేవి అనుగ్రహం మిథున రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు  శుక్ర, సోమ వారాలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అదృష్టం కూడా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచ సులభంగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  వీరు అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. 
    
సింహ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. దీని కారణంగా వీరు అదృష్టాన్ని పొందడమే కాకుండా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా డబ్బుతో రాజులా జీవిస్తారు. దీంతో పాటు దానధార్మాలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 


తులారాశి:
తులారాశి వారిని కూడా శుక్రుడు పరిపాలిస్తాడు. కాబట్టి ఈ రాశివారికి కూడా ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే వీరు మంచి ఆకర్శణను కలిగి ఉంటారు. దీంతో పాటు ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చిన సులభంగా రీకవారీ అవుతారు. అంతేకాకుండా అనుకోకుండా కూడా ఊహించని లాభాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.