Maha Lakshmi Rajyoga: కుజ - చంద్ర గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి జూన్ 30 నుంచి ముట్టిందల్లా బంగారమే..
Maha Lakshmi Rajyoga: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు మేష రాశిలో కుజ గ్రహంతో పాటు చంద్రగ్రహణం సంయోగం జరగబోతోంది. దీని కారణంగా జాతకంలో ఈ రెండు రాశుల శుభ స్థానంలో ఉన్నవారు ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా లాభపడతారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేసుకోండి..
Maha Lakshmi Rajyoga: జ్యోతిష శాస్త్రంలో ఉన్న అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. అలాగే అప్పుడప్పుడు ఈ గ్రహాలు తీరుగవనంతో పాటు సంయోగం కూడా చేస్తూ ఉంటాయి. ఇలా చేసినప్పుడల్లా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. గ్రహాలకు కమాండర్ గా పిలుచుకుని కుజుడు జూన్ ఒకటో తేదీన మేష రాశిలోకి సంచారం చేసింది. అయితే జూన్ 30న చంద్రగ్రహణం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో కుజ, చంద్రగ్రహాల కలయిక జరగబోతోంది. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఎంతో పవిత్రమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. మహాలక్ష్మి రాజయోగం ఎవరి జాతకంలో నైతే శుభ స్థానంలో ఉంటుందో ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. దీంతోపాటు అనుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అయితే జూన్ 30వ తేదీ నుంచి ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా ఏ రాశుల వారు ఎక్కువగా లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి:
మహాలక్ష్మి రాజయోగంతో మిధున రాశి వారు అనేక శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధన లాభాలతో పాటు డబ్బు పెద్ద మొత్తంలో సంపాదించగలుగుతారు. అలాగే కిరీకు సంబంధించిన అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండి భవిష్యత్తుపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ పనులు చేసిన ఈ సమయంలో సానుకూల ఫలితాలు కలిగే ఛాన్స్ ఉంది దీంతోపాటు ప్రేమ జీవితంలో కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అలాగే భౌతిక సుఖం కూడా సులభంగా పెరుగుతుంది.
కన్య రాశి:
కుజ చంద్రగ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన మహా లక్ష్మీ రాజయోగ ప్రభావం కన్యా రాశి వారిపై కూడా సమానంగా పడబోతోంది. దీంతో ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఊహించని ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఇక సింగిల్స్ ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలనే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతోపాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన లాభాలు పొందేందుకు శక్తిని కూడా పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వృశ్చిక రాశి:
ఈ సమయం వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో ఆనందంగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయం అనరు లభించి ఆర్థిక సంపద కూడా పొందుతారు. కెరీర్ కు సంబంధించిన జీవితం పూర్తిగా మెరుగుపడుతుంది. అలాగే వ్యక్తిగత జీవితం కూడా కాస్త మెరుగుపడే ఛాన్స్ ఉంది. దీంతోపాటు విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తే విజయాలు సాధించే ఛాన్స్ కూడా ఉంది. అలాగే సమాజంలో వ్యక్తి ఆదరణ పెరిగి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన పేరుతో పాటు డబ్బులు కూడా పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి