For Huge Money Womens do these things before sleeping at night: సనాతన ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందని చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో లక్ష్మీదేవి ఆశీర్వాదాలను (Lakshmi Devi Night Remedies) కొనసాగించడానికి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. రాత్రి నిద్రపోయే ముందు ఈ చర్యలు చేస్తే.. మా లక్ష్మి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందట. దాంతో ఆ ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు అస్సలు ఉండవట. నిద్రపోయే ముందు మహిళలు చేసే పనులు (Mahalakshmi Night Remedies) ఏంటో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంట్ల పాత్రలు శుభ్రం:
వంటగదిని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే నిద్రించండి. వంటగదిలో అంట్ల పాత్రలు ఉండకుండా మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టమని చెబుతారు. అందుకే వంటగది రాత్రి పూట శుభ్రంగా లేకుంటే లక్ష్మీదేవికి  కోపం తెప్పిస్తుంది.


పెద్దలకు సేవ:
పెద్దలను సేవించే ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది. ఎక్కడ పెద్దలను గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. స్త్రీలు నిద్రించే ముందు పెద్దలకు సేవ చేయాలి. పెద్దలు నిద్రించిన తర్వాతే మహిళలు నిద్రించండి. దాంతో లక్ష్మీదేవి ఇంట్లో ఆనందంగా ఉండి భక్తుల బాధలన్నిటినీ తొలగిస్తుంది.


పూజ గదిలో 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంట్లోని స్త్రీలు పూజ గదిలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. స్త్రీలు నిత్యం ఈ పని చేసే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. సంపద మరియు ధాన్యాలతో ఇంటిని నింపుతుంది.


పడమర మరియు దక్షిణం వైపున దీపం:
రోజూ రాత్రి పడుకునే ముందు ఇంట్లోని స్త్రీలు ఇంటికి పడమర మరియు దక్షిణం వైపున దీపం వెలిగించాలి. ఈ దిక్కున దీపారాధన చేయడం వల్ల కుటుంబ సభ్యులు పూర్వీకుల ఆశీస్సులు పొంది.. ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. పూర్వీకుల ఆశీస్సులతో కుటుంబ సభ్యులు ప్రతి పనిలో విజయం సాధించి జీవితంలో ముందుకు సాగుతారు.


పడక గదిలో కర్పూరం:
రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పడక గదిలో కర్పూరం పెట్టడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ముగిసి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.


Also Read: Upcoming Cars 2023: ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు.. చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్!  


Also Read: Google Pixel 7 Price: ఫ్లిప్‍కార్ట్ కంటే.. అమెజాన్‌లోనే తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 7! ఏకంగా రూ. 6300 వ్యత్యాసం   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.