Google Pixel 7 Price: ఫ్లిప్‍కార్ట్ కంటే.. అమెజాన్‌లోనే తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 7! ఏకంగా రూ. 6300 వ్యత్యాసం

Google Pixel 7 availabel lower price in Amazon compare to Flipkart. ఫ్లిప్‍కార్ట్ కంటే అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 6300 తక్కువగా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 31, 2023, 07:28 PM IST
  • అమెజాన్‌లో తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 7
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 6300 ఎక్కువ
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కస్టమర్లు
Google Pixel 7 Price: ఫ్లిప్‍కార్ట్ కంటే.. అమెజాన్‌లోనే తక్కువ ధరకు గూగుల్ పిక్సెల్ 7! ఏకంగా రూ. 6300 వ్యత్యాసం

Google Pixel 7 availabel lower price in Amazon compare to Flipkart: 'గూగుల్ పిక్సెల్ 7' ప్రస్తుతం ట్రెండింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొబైల్‍లో జబర్దస్త్ స్పెసిఫికేషన్లను ఉండడంతో జనాలు కొనడానికి ఎక్కువ ఆసక్తి చుపుతున్నారు. అయితే తక్కువ ధరలో గూగుల్ పిక్సెల్ 7ను కొనేందుకు.. కస్టమర్‌లు వేర్వేరు వెబ్‌సైట్లను తనిఖీ చేస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అయిన ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన ధరలను కంపేర్ చేసి చూస్తున్నారు.

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండూ ప్రసిద్ధ వెబ్‌సైట్‌లు అని తెలిసిన విషయం తెలిసిందే. ఈ రెండు వెబ్‌సైట్‌లలో ఓ వస్తువు ధరలో తేడాలు ఉంటాయి. ఈ క్రమంలోనే గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌పై కూడా చాలా వ్యత్యాసం ఉంది. ధరలో ఈ తేడాను చూసి కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధరలలో ఈ వ్యత్యాసం కారణంగా గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ను ఏ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయాలో కస్టమర్‌కు ఇట్టే అర్థమయిపోతుంది. 

గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు సుమారు రూ. 60000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ. 53630 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రెండు వెబ్‌సైట్‌లలో ధరల వ్యత్యాసం రూ. 6300. ఫ్లిప్‍కార్ట్ కంటే అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 6300 తక్కువగా ఉంది. దాంతో కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొంటున్నారు. 

Google Pixel 7 Specifications:
# 6.32 ఇంచుల ఫుల్ HD + OLED డిస్‍ప్లే
# 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్
# టెన్సార్ జీ2 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం
# 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్
# 10.8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
# 4270mAh బ్యాటరీ
# వైర్డ్, వైర్ లెస్ చార్జింగ్
# 5G, 4G LTE, వైఫై 6ఈ

Also Read: OLX Layoffs: ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్.. 1500 మంది ఉద్యోగులపై వేటు! భారత్‌లో కూడా

Also Read: Prithvi Shaw vs Shubman Gill: వన్డేలకు గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారు: మాజీ ఓపెనర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News