Mahashivratri 2023: శివలింగానికి అర్థం, శివుడు లింగ అవతారం ఎత్తడానికి కారణం తెలుసా?
Mahashivratri 2023: ఈరోజు మహాశివరాత్రి. పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు. ఈ పవిత్రదినాన అసలు శివలింగాన్ని ఎందుకు పూజిస్తారు, దీని వెనుక ఉన్న కథంటే తెలుసుకుందాం.
Mahashivratri 2023: సనాతన సంస్కృతిలో చిహ్నాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సనాతన సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే ముందుగా చిహ్నాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన మనం శివలింగానికి పూజలు చేస్తాం. అసలు ఈ శివలింగం అంటే ఏమిటి, దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శివలింగానికి అర్థం
హిందువులు శివలింగాన్ని దైవంగా కొలుస్తారు. ఎందుకంటే దీనిని శివుడికి ప్రతీకగా భావిస్తారు. సంస్కృతంలో శివ అంటే శుభమని, లింగం అంటే గుర్తింపు లేదా సంకేతం అని అర్థం. అంటే శివలింగం అనేది శివుడి యెుక్క గుర్తింపును సూచిస్తుంది లేదా సర్వ శుభప్రథమైన దైవాన్ని తెలుపుతుంది.
శివలింగం యెుక్క కథ
ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 18న జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ మహాదేవుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం పురాణాల్లో పేర్కొనబడింది. త్రిమూర్తులతో ఇద్దరైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి.. అది వారి మధ్య యుద్దానికి దారి తీసింది. దీంతో ప్రపంచం అల్లకల్లోలమైంది. వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు మహాదేవుడు రంగంలోకి దిగాడు. ఆ పరమశివుడు ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే మాఘ బహుళ చతుర్దశి నాటి అర్దరాత్రి. దీనినే లింగోద్భవ కాలమని పిలుస్తారు.
అయితే ఈ లింగం యెుక్క మెుదలను కనుగొనేందుకు విష్ణువు వరహా రూపంలోనూ, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లారు. వారు తమ గమ్యాన్ని చేరుకోలేక తిరుగువచ్చి పరమేశ్వరుడిని శరణు వేడారు. దాంతో ఆయన తన వాస్తవరూపంతో దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. తొలిసారిగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలానికి అంత విశిష్టత ఉంది. ఈ సమయంలో మహాదేవుడిని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
Also Read: Mahashivratri 2023: మహా శివరాత్రి రోజు.. ఏ సమయంలో పూజిస్తే ధనవంతులు అవుతారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
డ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.