Mahashivratri 2023: మహా శివరాత్రి రోజు.. ఏ సమయంలో పూజిస్తే ధనవంతులు అవుతారో తెలుసా?

Mahashivratri 2023 Puja Vidhi and Time: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శుభకరమైన రోజు మహాశివరాత్రి. ఈ పవిత్రమైన పర్వదినం ఇవాళే వచ్చింది. శివారాధాన సమయం, పూజా విధానం తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 09:04 AM IST
  • ఈరోజే శివపార్వతుల కళ్యాణం
  • దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ
  • శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి.
Mahashivratri 2023: మహా శివరాత్రి రోజు.. ఏ సమయంలో పూజిస్తే ధనవంతులు అవుతారో తెలుసా?

Mahashivratri 2023 Puja Time and Vidhi: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో మహాశివరాత్రి ఒకటి. దీనిని ప్రతి ఏటా మాఘ మాసం బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ పర్వదినం ఈరోజే వచ్చింది. దేశవ్యాప్తంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని జంగమయ్య ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మహిళలు, యువతలు, పిల్లలు తెల్లవారుజామున నుంచే శివారాధనలో మునిగితేలుతున్నారు. ఈరోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే సంతానంతోపాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. 

ఈ మహాశివరాత్రి శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. పైగా ఈరోజు కుంభరాశిలో శని, సూర్య, చంద్రుల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రోజుకు మరింత విశిష్టత పెరిగింది. ఈరోజు శుభముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి. 

మహాశివరాత్రి శుభ సమయం
శివరాత్రి రోజు రాత్రిపూట చేసే పూజే అత్యంత ముఖ్యమైనది. అంతకంటే ముఖ్యమైనది - నాలుగు గంటల పూజ. ఈ పూజ సాయంత్రం నుండి బ్రహ్మ ముహూర్తం వరకు జరుగుతుంది. నాలుగు ఘడియల పూజల శుభ ముహూర్తాన్ని తెలుసుకుందాం.
నిషిత కాల సమయం: ఫిబ్రవరి 18, రాత్రి 11.51 నుండి 12.41 వరకు
మొదటి గంట ఆరాధన సమయం: ఫిబ్రవరి 18, సాయంత్రం 06:41 నుండి రాత్రి 09:47 వరకు
రెండవ గంట పూజ సమయం: రాత్రి 09.47 నుండి 12.53 వరకు
మూడవ గంట పూజ సమయం: ఫిబ్రవరి 19, మధ్యాహ్నం 12.53 నుండి 03.58 వరకు
నాల్గవ గంట పూజ సమయం: ఫిబ్రవరి 19, తెల్లవారుజామున 03:58 నుండి ఉదయం 07:06 వరకు. 

మహాశివరాత్రి నాడు శని ప్రదోష యోగం
అదేవిధంగా మహాశివరాత్రి నాడు శని ప్రదోషం కూడా ఏర్పడుతోంది. శని దోషం పోవాలంటే శివుడికి నల్ల నువ్వులతో అభిషేకం చేయండి. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో ఉన్నాడు. ఇలా జరగడం 30 ఏళ్ల తర్వాత ఇదే మెుదటిసారి. 
పూజా విధానం
ఈ రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం గుడికి వెళ్లి లేదా ఇంట్లోని పూజా మందిరంలో శివలింగానికి పూజలు చేయండి.  పూలు, అగరబత్తులు, నెయ్యి, పెరుగు, తేనె, తాజా పాలు, పంచామృతం, రోజ్ వాటర్, స్వీట్లు, గంగాజల్, కర్పూరం, తమలపాకులు, లవంగాలు, యాలకులుతో శివరాధాన చేయండి. తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుని, గంగాజలం, చెరుకు రసం, నెయ్యి మరియు ఆవు పాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేయండి. తర్వాత శివుడికి గంధం పూసి.. బిల్వ పత్రంతో పూజించండి. అనంతరం మహామృత్యుంజయ మంత్రం- ఓం త్ర్యంబకం స్యజ మంత్రమహే సుగంధి పుష్టివర్ధనం. ఉర్వారుకమివ్ బన్ధనన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥ జపించండి . చివరగా హారతి ఇచ్చి పూజను పూర్తిచేయండి. 

Also Read: Maha Shivaratri 2023: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

 

డ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
.

Trending News