మకర సంక్రాంతి పండుగ దేశం మొత్తం మీద అత్యంత ఘనంగా జరుపుకుంటారు. భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు. సూర్యారాధన చేస్తుంటారు. మకర సంక్రాంతి నాడు కొన్ని రాశులకు అత్యంత శుభసూచకం కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర సంక్రాంతి జనవరి 15న అంటే ఇవాళ జరుపుకుంటున్నారు. గ్రహాల  రాజైన సూర్యుడు జనవరి 14వ తేదీ రాత్రినే మకర రాశిలో ప్రవేశించాడు. కానీ మకర సంక్రాంతి పుణ్యతిధి మాత్రం ఇవాళ ఉంది. ఇవాళ అంటే మకర సంక్రాంతి నాడజు స్నానం చేసి దానాలు చేయడానికి పుణ్యతిధి సూర్యోదయం కంటే ముందు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలవరకూ ఉంటుంది. మహా పుణ్యకాలం ఉదయం 7.15 గంటల్నించి 9.06 గంటల వరకూ దాదాపు 2 గంటలుంటుంది.


మకర సంక్రాంతి నాడు ఎవరికి అత్యంత లాభదాయకం


మేషరాశి


మకర సంక్రాంతి మేషరాశి జాతకులకు శుభవార్త అందిస్తుంది. ఉద్యోగంలో వృద్ది లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రయోజనం కలుగుతుంది. మీ వాయిస్ ఆధారంగా పనులు చేయించుకుంటారు.


సింహరాశి


మకర సంక్రాంతి సింహ రాశివారికి చాలా లాభదాయకం. ఈ జాతకులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శత్రువులు పారిపోతారు. ఎగుమతి, దిగుమతికి సంబంధించి పెద్దఎత్తున లాభాలు ఆర్జిస్తారు. అభివృద్ధికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.


కన్యారాశి


సూర్యుడు మకరరాశిలో గోచారం సందర్భంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. ఈ సందర్భంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసొస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా అతిపెద్ద విజయం సాధిస్తారు. పెట్టుబడులతో లాభముంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.


వృశ్చికరాశి


సూర్యుడి మకర రాశి పరివర్తనం వృశ్చికరాశి జాతకుల్లో ఆత్మ విశ్వాసం, సాహసం పెంచుతుంది. ప్రతి పనిలో సాఫల్యం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన సమయం.  ప్రయాణాలు చేయవచ్చు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు గుడ్‌న్యూస్ లభిస్తుంది. 


మకర రాశి


సూర్యుడి మకర రాశి ప్రవేశం కారణంగా మకర సంక్రాంతి ఈ రాశి జాతకులకు అత్యంత ఎక్కువ లాభదాయకం, శుభ సూచకం. ఈ జాతకుల పనుల్లో విజయం లభిస్తుంది. నిలిచిన పనులు పూర్తవుతాయి. అభివృద్ది సాధిస్తారు. రోగాల్నించి విముక్తి పొందుతారు.


Also read: Makar sankranti 2023: త్రిగ్రహ యోగంలో మకర సంక్రాంతి, రాశిని బట్టి ఎవరేం చేయాలి, జాతకం ఎలా ఉంటుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook