Makar sankranti 2023: జ్యోతిష్యశాస్త్రరం ప్రకారం జనవరి 14వ తేదీ రాత్రి సూర్యుడు ధనరాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజున స్నానం చేసి దానం చేయడంపై విశేష మహత్యముంది. ఈ రాశి ప్రకారం దానం చేయడం వల్ల శుభం జరగనుంది. ఈ రోజున చిత్ర నక్షత్రం ప్రత్యేక సంయోగం ఏర్పడనుంది. దీనిని అత్యంత శుభసూచకంగా భావిస్తారు. దాంతోపాటు సూర్యుడు, శని, శుక్ర గ్రహాలతో త్రిగ్రహయోగం ఏర్పడనుంది.
కర్కాటకం, సింహం, కన్యారాశి జ్యోతిష్యం ప్రకారం మకర సంక్రాంతి నాడు సూర్యదేవుడి పూజ తరువాత బియ్యం, వెండి, తెల్లటి బట్టలు, పాలు వంటివి దానం చేయాలి. సింహరాశి జాతకులు పూజ తరువాత పేదలకు గోధుమలు, నారింజ రంగు బట్టులు, బెల్లం, సూర్య చాలీసా, ఎర్ర చందనం, ఎర్ర పూలు దానం చేయాలి. కన్యారాశి జాతకులు కూడా సూర్య ఆరాధన తరువాత పచ్చ పండ్లు, పచ్చ కూరగాయలు దానం చేయాలి.
మేషం, వృషభం, మిధునం మకర సంక్రాంతి నాడు మేష రాశి జాతకులు స్నానం, పూజ తరువాత మసూర్ దాల్, ఎర్ర బట్టలు, కంచు, ఎర్ర పూలు దానం చేయాలి. వృషభరాశి జాతకులు ఇవాళ బియ్యం, పాలు, తెల్లటి బట్టలు, వెండి దానం చేయాలి. మిధున రాశి జాతకులు మకర సంక్రాంతి నాడు గోవులకు పచ్చని మేత తిన్పించాలి. ఈ రోజున ఎవరైనా బ్రాహ్మణుడికి పచ్చని బట్టలు, పచ్చ పెసలు, పచ్చ కూరగాయలు దానం చేయాలి
మకరం, కుంభం, మీన రాశులపై జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు, శని దేవుడి పూజ తరువాత నువ్వులు, కంబలి, శని చాలీసా దానం చేయడం చాలా మంచిది. కుంభరాశి జాతకులు ఇవాళ సూర్యపూజ అనంతరం కంబలి, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేయాలి. మీనరాశి జాతకులు సూర్యుడి పూజ తరువాత పసుపు బట్టలు, గీత లేదా విష్ణు సహస్రనామం పుస్తకం, ఇత్తడి దానం చేయాలి
తుల, వృశ్చికం, ధనస్సు రాశులపై మకర సంక్రాంతి నాడు సుగంధ పదార్ధాలైన అత్తరు, తెల్లటి బట్టలు, శుక్రుడికి చెందిన వస్తువుల్ని దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు. వృశ్చికరాశి జాతకులు ఎర్ర బట్టలు, ఎర్ర పూలు, మసూర్ దాల్, ఎర్ర పెసలు వంటి దానం చేయాలి. ఈ వస్తువుల్ని దానం చేయడం శుభసూచకమౌతుంది. ధనస్సు రాసి వారు ఈ రోజున పసుపు బట్టలు, ఇత్తడి, బంగారం, పసుపు లేదా ఇతర మత గ్రంథాలు దానం చేయాలి