Makar Sankarnti 2023, Surya Gochar: జనవరి నెలలో చాలా గ్రహాలు ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ నెలలో రాశి చక్రాల్లో తీవ్ర మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జనవరి 14 రాత్రి సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయనుంది. ఇదే క్రమంలో జనవరి 14న మకర సంక్రాంతి పండగ కూడా రాబోతోంది. అయితే ఇదే క్రమంలో సూర్యుడు, శని, శుక్రుడు మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడంతో మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా జీవితాలలో ఆర్థిక ప్రగతితో పాటు ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.  సూర్యుడు మకరరాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఈ రాశువారిపై త్రిగ్రాహి యోగం:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం:
సూర్య గ్రహం మకరరాశిలోకి సంచారం చేయడం వల్ల  వృషభ రాశి వారికి చాలా  రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల పరంగా విశేష గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంచార క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.


మిథునరాశి:
మకరరాశిలో సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల మిథునరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తండ్రి సహకారంతో ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.


కర్కాటకం:
ఈ సంచారం కారణంగా జీవిత భాగస్వామి మంచి సంబంధాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించి విషయాల్లో శుభవార్తలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కెరీర్‌లో కొత్త అవకాశాలు పొందే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి మంచి జీవితాన్ని అనుభవిస్తారు. ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


 

Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే


Also Read: Waltair Veerayya Censor Review : వాల్తేరు వీరయ్య సెన్సార్ టాక్.. ఆ సీన్లకు పూనకాలు లోడింగే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి