Mangal Transit 2023: ధైర్యం, శక్తి, శౌర్యం, భూమి మొదలైన వాటికి అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. నూతన సంవత్సరంలో కుజుడు జనవరి 13న మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మేష, వృశ్చిక రాశికి అధిపతి మార్స్. వృషభరాశిలో కుజుడు ప్రత్యక్ష సంచారంలోకి (Mangal Margi 2023) రానున్నాడు. కుజుడు రాశి మార్గి కొన్ని రాశులవారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి (Taurus): ఈ రాశిలోనే కుజుడు సంచరించబోతున్నాడు. కష్టపడి పనిచేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈసమయం అనుకూలంగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబంలో చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. 
సింహరాశి (Leo): సింహ రాశి వారికి కుజుడు సంచారం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఆఫీసులో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. అంగారుకుడి సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. బిజినెస్ లో కొత్త డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. టెండర్లన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. చిత్తశుద్ధితో కృషి చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు సంక్రాంతి సందర్భంగా దృఢ సంకల్పంతో పనిచేస్తే శుభ ఫలితాలు పొందుతారు. 
వృశ్చికరాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి కుజుడు సంచారం శుభప్రదం అవుతుంది. మీరు ఆధాత్మిక విషయాల పట్ల మెుగ్గు చూపుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది. కెరీర్ లో మీరు పురోగతి సాధిస్తారు. 


ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశికి అంగారకుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికంగా పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మీలో మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభపడతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వృత్తి జీవితం బాగుంటుంది. 
మీనరాశి (Pisces): మీన రాశి వారికి అంగారకుడి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మీరు మీ పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. మీనరాశి వారు కెరీర్‌లో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి.


Also Read: Grah Gochar 2023: మకర రాశిలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులపై ప్రతికూల ప్రభావం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe