Mangal Gochar 2023: అంగారుకుడి సంచారం.. ఉగాది నుండి ఈ రాశులకు భారీ డబ్బు నష్టం, కెరీర్ లో ఇబ్బందులు
Mangal Gochar March 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ధైర్యాన్ని ఇచ్చే అంగారకుడు ఈనెల 13న రాశిని మార్చాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనున్నారు..
Mars Transit March 2023: ఈ ఏడాది అంగారకుడి మొదటి సంచారం మార్చి 13, 2023 ఉదయం 05:33 గంటలకు మిథునరాశిలో జరిగింది. బుధుడు మిథునరాశికి అధిపతి మరియు కుజుడు బుధునితో శత్రుత్వం కలిగి ఉంది. మార్స్ వృషభరాశిని విడిచిపెట్టి జెమినిలోకి వెళ్లాడు. ధైర్యాన్ని ఇచ్చే అంగారుకుడి సంచారం కొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కుజ సంచారం ఈ రాశులకు ప్రతికూలం..
వృషభం (Taurus): వృషభ రాశి వారికి కుజుడు సంచారం శుభప్రదం కాదు. దీని కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రవర్తన కారణంగా ఇతరులతో సంబంధాలు చెడిపోతాయి. ఈ సమయంలో మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం మంచిది.
కర్కాటకం (Cancer): మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు అనుకోకుండా ట్రాన్సఫర్ అవుతారు. ధన నష్టం వాటిల్లుతుంది. మీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు ఒత్తిడికి గురవుతారు.
వృశ్చికం (Scorpio): వృశ్చికరాశి వారికి అంగారక సంచారం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబంలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి యెుక్క ఏడవ ఇంటిలో కుజుడు సంచరించబోతున్నాడు. ఇది మీ వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తుతాయి. అంగారక గ్రహ సంచారం కూడా ప్రేమ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆఫీసులో సమయం కలిసిరాదు. మీ దూకుడు ప్రవర్తన, మాటతీరు మార్చుకోకపోతే మీకే నష్టం.
Also Read: Budh Gochar 2023: సూర్య-బుధుడి 'బుధాదిత్య యోగం'.. మీనరాశి వారికి అద్భుత ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook