CRPF Constable Notification : ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే అభ్యర్థులకు సువర్ణావకాశం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలుకానుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 9 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ crpf.gov.in ను సందర్శించండి. రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు ఇలా..
అర్హతలు..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 9,212 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 107 పోస్టులు మహిళలకు కేటాయించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 24. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 1 నుంచి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 20న జారీ చేస్తారు. రాత పరీక్షతో పాటు నియామక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 9,212. పురుషులకు 9,105, మహిళలకు 107 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్ట్‌లలో పే లెవల్-3 రూ.21,700– 69,100 పరిధిలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము ఎంత..?
జనరల్, ఈడబ్య్లూఎస్, ఓబీసీ వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.100. ఎస్సీ/ఎస్టీ, మహిళలు (అన్ని కేటగిరీలు), మాజీ సైనికులకు సంబంధించిన అభ్యర్థులకు సడలింపు ఉంది. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి మొదలైనవి ఒక్కో పోస్టుకు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోండి.
ఖాళీలు ఇలా..
==> డ్రైవర్: 2372
==> మోటార్ మెకానిక్: 544
==> కాబ్లెర్ (చెప్పులు కుట్టేవాళ్లు): 151
==> వడ్రంగి: 139
==> దర్జీ: 242
==> బ్రాస్ బ్యాండ్: 172
==> పైప్ బ్యాండ్: 51
==> బగ్లర్: 1340
==> గార్డనర్: 92
==> చిత్రకారుడు: 56
==> కుక్: 2475
==> బార్బర్: 303
==> హెయిర్ డ్రస్సర్: 1
==> వాషర్‌మ్యాన్: 406
==> సఫాయి కరంచారి: 824
==> ప్లంబర్: 1
==> తాపీ మేసన్: 6
==> ఎలక్ట్రీషియన్: 4
ముఖ్యమైన తేదీలు:
==> ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 27/03/2023
==> ఆన్‌లైన్ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25/04/2023
==> అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: 20/06/2023 నుంచి 25/06/2023 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
==> కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ (తాత్కాలిక): 01/07/2023 నుంచి 13/07/2023 వరకు
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెర.. డీఏ పెంపుపై నేడే ప్రకటన
Also Read: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి