Mangal Gochar 2023 in LEO on 01st July 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. జూలై 01న కుజుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో మార్స్ ఆగస్టు 17 వరకు ఉండనున్నాడు. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. ఆదిత్యుడి రాశిలో కుజుడు సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహం:


కుజుడు సంచారం సింహరాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఈరాశి యెుక్క 4వ మరియు 9వ ఇంటికి కుజుడు అధిపతి. మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సింహరాశి వారు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 


ధనుస్సు:


మార్స్ గోచారం ధనుస్సు రాశికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. దీంతో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. 


Also Read: Shukra gochar 2023: జూలై 07న శుక్రుడి గమనంలో పెను మార్పు... ఈ 3 రాశులకు ఊహించనంత డబ్బు..


మేషం:


అంగారకుడి రాశి మార్పు వల్ల మేషరాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఈరాశి వారి జాతకంలోని నాల్గో ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. దీంతో మీరు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 


(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది)


Also Read: Budh Gochar 2023: జూన్ 24న బుధుడి రాశి మార్పు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి