Mangal Gochar in March 2024: మరో రెండు రోజుల్లో మూడో నెల అయిన మార్చి రాబోతుంది. ఈ నెలలో కొన్ని కీలక గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. వీటిలో అంగారక గ్రహం ఒకటి. మార్చి 15న గ్రహాల కమాండరైన కుజుడు మకరరాశి నుంచి కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. అప్పటికే శని కుంభంలో ఉండటం వల్ల వారిద్దరి కలయిక జరగబోతుంది. అంగారకుడి రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభరాశి
ఇదే రాశిలో అంగారకుడి సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీకు మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
మకరరాశి
మకర రాశి వారికి అంగారక సంచారం చాలా లాభాలను ఇస్తుంది. మీరు పాత వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. 
మేష రాశి
కుజుడు రాశి మార్పు మేషరాశి వారిపై మంచి ప్రభావాన్ని చూపించబోతుంది. దీని కారణంగా మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎదురుచూసే వారి కోరిక ఫలిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. 
సింహరాశి
కుంభ రాశిలో అంగారకుడు సంచారం సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు అనారోగ్యం నుండి బయటపడే అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2024: త్వరలో శుక్రుడు-రాహువు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..


Also Read: Trigrahi Yoga 2024: 300 ఏళ్ల తర్వాత శివరాత్రిరోజు అరుదైన త్రిగ్రాహి యోగం.. 3 రాశులకు గోల్డెన్ టైం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook