Mars transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని శుభ గ్రహంగా భావిస్తారు. దైర్యానికి కారకుడైన కుజుడు తన రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. జాతకంలో అంగారకుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక విజయాలను సాధిస్తాడు. కొత్త ఏడాదిలో మార్స్ గ్రహం తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు వృషభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే ఏడాది అంటే జనవరి 13, 2023 నుంచి నేరుగా నడవనున్నాడు. వృషభరాశిలో అంగారుకుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- మేష రాశి వారికి మార్గి కుజుడు చాలా ప్రయోజనాలను ఇస్తాడు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వ్సతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగుస్తులకు ఈ సమయం బాగుంటుంది. 
సింహ రాశి (Leo)- అంగారకుడి ప్రత్యక్ష కదలిక సింహ రాశి వారికి అనేక శుభవార్తలను ఇస్తుంది. మీరు మీ కెరీర్‌లో గరిష్ట ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ ను పొందుతారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. 
కన్య (Virgo)- కుజుడు ప్రత్యక్ష సంచారం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీకు ఏది అవసరమో అది దొరుకుతుంది.


Also Read: Shukra Gochar 2022: మకరరాశిలో శుక్ర సంచారం.. ఈ 5 రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.