Shukra Gochar 2022: మకరరాశిలో శుక్ర సంచారం.. ఈ 5 రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం..

Shukra Gochar 2022: మరో వారం రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ఇది 5 రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 10:00 AM IST
  • ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది
  • ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు
  • ఈ రాశుల అదృష్టం ప్రకాశించనుంది
Shukra Gochar 2022: మకరరాశిలో శుక్ర సంచారం.. ఈ 5 రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం..

Shukra Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, లవ్, రొమాన్స్, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 29న శుక్ర గ్రహం మకరరాశిలో (Venus transit in Capricorn 2022) సంచరించబోతున్నాడు. అదే రాశిలో జనవరి 22, 2023 వరకు ఉంటాడు. మకరంలో శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశుల అదృష్టం ప్రకాశించనుందో తెలుసుకుందాం. 

మేషం (Aries): శుక్రుని సంచారం వల్ల ఈ రాశివారికి ధనలాభం పొందుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. లైఫ్ పార్టనర్ యెుక్క సపోర్టు లభిస్తుంది. ప్రతిరోజూ 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
కన్య (Virgo): ఈ రాశి వారు ధార్మిక పనుల పట్ల మొగ్గు చూపుతారు మరియు వారు మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. సంపద రెట్టింపు అవుతుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ప్రతిరోజూ లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల మీకు బాగుంటుంది.
తుల (Libra): ఈ సంచారం తులారాశి వారికి శుభప్రదం కానుంది. వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వృత్తిలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. ఈసమయంలో మీరు శుభవార్తను వినే అవకాశం ఉంది. మీకు అదృష్టం తలుపు తడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. 

మకరం (Capricorn): శుక్రుడు మకరరాశిలో సంచరించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వింటారు. జనవరిలో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మందార పువ్వును సమర్పించండి.
మీనం (Pisces): శుక్రుని సంచారం వల్ల మీన రాశి వారు కోరికలు నెరవేరుతాయి. పెండింగ్ లో పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. ప్రతి గురువారం శివాలయంలో పూజలు చేయండి. 

Also read: Guru Gochar: 2023లో బృహస్పతి గమనంలో మార్పు... ఈ 5 రాశులకు పండగే పండుగ.. డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News