Mangal Margi In 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 13న అంగారకుడు వృషభరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. అంగారకుడిని గ్రహాల కమాండర్, కుజుడు, మార్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కుజుడి యెుక్క ప్రత్యక్ష కదలిక (Mangal Margi 2023) కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశిచక్రం (Scorpio): అంగారకుడి సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి ఏడవ ఇంటిలో మార్పు చెందబోతున్నాడు. పార్టనర్‌షిప్‌తో చేసే వ్యాపారంలో మీరు భారీగా లాభాలను గడిస్తారు. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
తులా రాశిచక్రం (Libra): అంగారకుడి ప్రత్యక్ష కదలికతో మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మంగళదేవుడు మీ సంచార జాతకం నుండి ఎనిమిదవ ఇంట్లో సంచరించనున్నాడు. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. పరిశోధన రంగంలో నిమగ్నమైన వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాలంలో మీరు స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలో డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభం పొందుతారు. 
మీన రాశిచక్రం (Pisces): అంగారకుడి మార్గం కారణంగా మీన రాశి వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ రాశి నుండి మూడవ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీ సోదరసోదరీమణుల సపోర్టు మీకు లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Grah Gochar 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న మెర్క్యూరీ.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.