Grah Gochar 2023: జనవరి మరియు ఫిబ్రవరి 2023లో అనేక గ్రహాలు తమ రాశిచక్రాలను మార్చుకోనున్నాయి. బుద్ది, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడు బుధుడు. మెర్క్యూరీ గ్రహం ఫిబ్రవరిలో తన రాశిని మార్చుకుని మకరరాశిలో సంచరించనుంది. బుధ సంచారం అరుదైన త్రికోణ రాజయోగాన్ని సృష్టింనున్నాయి. ఆస్ట్రాలజీలో బుధ గ్రహాన్ని శుభగ్రహంగా భావిస్తారు. మకరరాశిలో బుధుడు ఉండటం వల్ల ఏర్పడుతున్న త్రికోణ రాజయోగం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి (Aries): మకరరాశిలో మెర్క్యురీ యొక్క సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి జాతకంలోని 11వ ఇంట్లో త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఆఫీసులో ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బిజినెస్ చేసే వారు మంచి లాభాలను గడిస్తారు.
మకరరాశి (Capricorn): ఈ రాశిలోనే బుధ గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి బుధుడు రాశి మార్పు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ లో మీరు అపారమైన పురోగతిని సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి నుండి మీరు ఉపశమనం పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
తులారాశి (Libra): ఈ రాశిచక్రం యొక్క నాల్గవ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. మెర్క్యూరీ సంచారం కారణంగా తులరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ సౌకర్యాలలో పెరుగుదల ఉంటుంది. మీరు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Budh Gochar 2023: శని యెుక్క రాశిలోకి బుధదేవుడు.. ఇక ఈ రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.