Mangal Shukra Gochar 2022: అరుదైన రాజయోగం చేస్తున్న కుజుడు, శుక్రుడు.. ఈ మూడు రాశులకు ధనప్రాప్తి..
Mars Venus Transit 2022: వృశ్చికరాశిలో శుక్రుడు, వృషభరాశిలో కుజుడు సంచారం వల్ల అరుదైన ధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Mangal Shukra Gochar 2022: జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం నవంబర్ 13, 2022న కుజుడు వృషభరాశిలోకి ప్రవేశించగా, శుక్రుడు కూడా రాశిని మార్చుకుని వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాగా... వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే శుక్ర గ్రహానికి చెందిన రాశిలో కుజుడు కూర్చుని ఉండగా, అంగారకుడి స్వంత రాశిలో శుక్రుడు కూర్చున్నాడు. అలాంటి కుజుడు, శుక్ర గ్రహ స్థానం ధన రాజయోగాన్ని (Dhan Raja yoga 2022) సృష్టిస్తోంది. శుక్రుడు వృశ్చికరాశిని విడిచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే డిసెంబర్ 5 వరకు ఈ రాజయోగం కొనసాగుతుంది. ఈ ధన రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
ధనరాజయోగం ఈ 3 రాశులవారికి శుభప్రదం
వృషభం (Taurus): వృషభ రాశి వారికి ఈ ధన రాజయోగం చాలా లాభదాయకం. ఈ యోగం వల్ల వీరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీరు ప్రజలను ఆకట్టుకుంటారు. అంతేకాకుండా మీరు కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటకం (Cancer): ఈ సమయం వృత్తికి చాలా మంచిది. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీకు పదవి లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
ధనుస్సు (Sagittarius): కుజుడు మరియు శుక్రుడు ఈ వ్యక్తులకు గొప్ప ప్రయోజనాలను ఇస్తారు. జీవితంలో ఆనందం నెలకొంటుంది. మీ జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తులకు పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులు ఏదైనా పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు.
Also Read: Astrology: అనురాధ నక్షత్రంలో మూడు గ్రహాలు... ఈ రాశులకు ఆర్థికంగా లాభం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook