India Playing 11 vs New Zealand 2nd ODI: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 300లకు పైగా స్కోరును కూడా భారత్ కాపాడుకోలేక మూల్యం చెల్లించుకుంది. ఇక ఆదివారం హమిల్టన్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే మరో మ్యాచ్ మిగిలుండగానే.. భారత్ సిరీస్ కోల్పోతుంది. ఈ క్రమంలోనే రెండో వన్డేలో గెలవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారానే సిరీస్ కైవసం చేసుకోవాలని కివీస్ చూస్తోంది.
మొదటి వన్డేలో ఓపెనర్లుగా రాణించిన శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ స్థానాలకు డోకా లేదు. తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. సెంచరీ చేరువగా వచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ ఆశలు అతడిపైనే ఉన్నాయి. తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫామ్‌తో సతమతమవుతున్న రిషభ్ పంత్ వైస్ కెప్టెన్సీ, కీపర్ హోదాలో జట్టులో ఉంటాడు. దాంతో దీపక్ హుడా బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ చోటుకు డోకా లేదు. ఎందుకంటే తొలి వన్డేలో బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చహర్ ఆడే అవకాశం ఉంది. చహర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ కూడా బలోపేతం అవుతుంది. చహర్ జతగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా బరిలోకి దిగనున్నారు. తొలి వన్డేలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒక్క వికెట్ తీయలేదు. పైగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ స్పిన్నర్ వద్దనుకుంటే మరో పేసర్ (శార్దూల్ ఠాకూర్) ఆడతాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్.
Also Read: Cobra Mongoose Viral Video: బ్లాక్ కోబ్రా, ముంగిస మధ్య భీకర ఫైట్.. చివరకు ఏది గెలిచిందో తెలుసా?
Also Read: Actor Simbhu: ఎన్టీఆర్ తరువాత కుర్ర హీరో కోసం శింభు 'గాత్ర దానం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.