Mangala Gowri Vratham 2022: శ్రావణమాసం వచ్చిందంటే చాలు దేశమంతా ఆధ్యాత్మికతలోకి వెళ్లిపోతుంది. అందులోనూ.. సోమవారమంటే మరీ స్పెషల్. మహాశివుడి పూజలతో.. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో నిండిపోతాయ్. అభిషేకాలు, ఉపవాసాలతో.. ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే శ్రావణమాసంలో సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉందో.. మంగళవారానికి కూడా విశేషం ఉంది. ఎందుకంటే ఆ రోజున మహిళలంతా మంగళగౌరీ వ్రతం చేస్తుంటారు. ఈ శ్రావణమాసంలో ఆగస్ట్ 9న వచ్చే మంగళవారమే, చివరి మంగళగౌరీ వ్రతాన్ని జరుపుకోబోతున్నారు. ఈ రోజున పార్వతీ దేవి ఆశీస్సులను పొందాలంటే.. ఈ స్టోరీ మొత్తం చదవండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళగౌరీ వ్రతం రోజున పార్వతీ దేవిని పూజిస్తూ.. ఆడపడచులు, ముత్తైదులు ఈ వ్రతాన్ని చేస్తారు. దీంతో పాటు మహాశివుడు, వినాయకుడిని కూడా ఆరాధిస్తారు. మంగళగౌరీ వ్రతం రోజున గౌరీ మాతాను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మంగళగౌరీ వ్రత విధానం:


మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల.. పార్వతీ దేవి అనుగ్రహం లభిస్తుందని మహిళలు నమ్ముతుంటారు. ఆ పరమేశ్వరి అనుగ్రహంతో పాటు అఖండమైన అదృష్టాన్ని పొందేందుకు.. స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో నియమ, నిష్టలతో.. భక్తి శ్రద్ధలతో చేస్తారు. మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి.. పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఉపవాసం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి.. అందులో ఒక ఎర్రని వస్త్రాన్ని పరచాలి. దానిపై మహాశివుని విగ్రహంతో పాటు పార్వతీ దేవి ప్రతిమను, వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలి. తర్వాత మంగళ గౌరీకి బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేయాలి. నెయ్యి పోసిన దీపం వెలిగించాలి. అలాగే ఎర్రని గాజులు, ఎరుపు రంగులో ఉన్న బిందెలు, మెహందీతో పాటు తేనెతో కూడిన నైవేద్యాన్ని సమర్పించి ఉపవాసం కథను చదవాలి. ఈ విధంగా నియమ, నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ దేవిని పూజిస్తే, ఆమె అనుగ్రహం సిద్ధిస్తుందని.. మహిళలు నమ్ముతుంటారు.


(NOTE: ఈ సమాచారం అంతా సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. Zee Telugu News దీనిని ధ్రువీకరించడం లేదు. పూర్తి వ్రత విధానం కోసం ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల సలహా తీసుకోవాలి.)


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!


Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook