Margasira Masam 2024: `మాసానాం మార్గశీర్షోహం`.. ఈనెల విష్ణువుకు ఎందుకంత ఇష్టం.. ముఖ్యమైన పండుగలు ఇవే..
Margasira Masam 2024: మార్గశిర మాసంలో కూడా అనేక పండగలు వరుసగా వస్తుంటాయి. ఈ మాసంలో కూడా కార్తీకంలా.. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతీకరమైందని చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Margasiramasam Festivals history and tradition: సాధరణంగా మనకు 12 నెలలు ఉంటాయి. అయితే.. అందులో కొన్ని మాసాలు అంటే దేవుళ్లకు అత్యంత ఇష్టమైనవని చెబుతుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీకం, మార్గశిర మాసాలు శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైనవని చెబుతుంటారు.
ఈ మాసాల్లో ముఖ్యంగా మనం చేసే పూజలు,వ్రతాలు కోట్ల రేట్లు మంచి ప్రయోజనంను కల్గిస్తాయంట. అందుకే ఈ మాసాల్లో ప్రతిరోజు ఏదో ఒక పండగ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మార్గశిర మాసం స్టార్ట్ అయ్యింది. అయితే.. మార్గశిరంలో వచ్చే ప్రధానమైన పండగలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
'మాసానాం మార్గశీర్షోహం'..
మార్గశిరం అంటే.. శీర్షం అంటే శిరస్సు అని..అర్థం. అంటే.. మనకున్న అన్ని నెలలో కన్న కూడా.. మార్గశిరం ప్రధానమైందని చెబుతంటారు. మార్గశిరంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. ఈ మాసంలో సూర్యుడి ధనస్సులోకి ప్రవేశిస్తాడు. ముఖ్యంగా ఈ మాసంలో వైష్ణవులు.. ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతిరోజు గోదాదేవీ పాశురాలను భక్తితో చదువుతుంటారు.
ఈ నెలలోనే.. మోక్షద ఏకాదశి దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తుంటారు. ఇదే రోజున గీత జయంతి, ఆ తర్వాత పౌర్ణమి రోజున..దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. అదే విధంగా తిరుప్పావై ఉత్సవాలు జరుపుతారు. చాలా చోట్ల వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై గోదాదేవీ కళ్యాణంను నిర్వహిస్తారు.
డిసెంబర్ 07 సుబ్రహ్మణ్యషష్టి
ఈరోజున చాలా మంది సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా రాహు,కేతు దోషాలు, కాలసర్పదోషాలున్నవారు పూజలు చేయించుకుంటే దోషపరిహారమౌతుంది.
డిసెంబర్ 08 కాలభైరవాష్టమి
కాలభైరవస్వామి అనుగ్రహాం కోసం.. ఈరోజు చాలా మంది శునకాలకు చపాతీలు పెడుతుంటారు. శివుడి అనుగ్రహం కోసం అభిషేకం చేయించుకుంటారు.
డిసెంబర్ 11 గీతా జయంతి , ముక్కోటి ఏకాదశి
ఈరోజున అర్జునుడికి శ్రీకృష్ణుడు ..గీతను బోధించాడని చెబుతుంటారు. అందుకే గీతాజయంతిని జరుపుకుంటారు.
డిసెంబర్ 13 హనుమద్ర్వతం
చాలా మంది ఆంజనేయ స్వామి మాలను ధరించుకుంటారు. కొండగట్టు అంజన్న దగ్గరకు వెళ్తుంటారు.
డిసెంబరు 14-15 దత్త జయంతి
మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటారు. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. దత్తాత్రేయ జయంతిని మార్గశిర మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. దత్తత్రేయ స్వామిని చాలా మంది ఎంతో భక్తితో ఆరాధిస్తుంటారు. ఈరోజున గురుచరిత్ర పారయాణ చేస్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.