Mangal Ketu Navpancham Yog 2022:  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనాన్ని మార్చడం, రాశిచక్రం మార్చడం, సంయోగం చేయడం మాత్రమే కాకుండా.. అవి శుభ మరియు అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలో అంగారకుడు మరియు కేతువు గ్రహాలు కలిసి చాలా అశుభకరమైన యోగాన్ని ఏర్పరుస్తున్నారు.  అదే నవపంచం యోగం (Navpancham Yog). అక్టోబర్ 16న మిథునరాశిలో కుజుడు సంచరించాడు. దీంతో కుజుడు, కేతువు కలిసి ఈ పేలుడు యోగాన్ని సృష్టించారు. ఈ నవపంచం యోగం 4 రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై చెడు ప్రభావం..
మేషం (Aries): నవపంచం యోగం మేషరాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈసమయంలో వీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గొంతు మరియు ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 
వృషభం (Taurus): కుజుడు కేతువు వల్ల ఏర్పడుతున్న నవపంచమ యోగం వృషభ రాశి వారికి కూడా మేలు చేస్తుందని చెప్పలేం. దీంతో మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది లేదా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేనమామతో సంబంధాలు దెబ్బతినే అవకాశంఉంది. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. 


కర్కాటక రాశిఫలం (Cancer): మీరు కోర్టు చుట్టూ తిరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఓడిపోతారు కూడా. ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. లేకుంటే వారికి కూడా ప్రమాదం జరగవచ్చు. 
వృశ్చికం (Scorpio): కుజుడు కేతువు వల్ల ఏర్పడిన నవపంచం యోగం వృశ్చికరాశి వారికి ఆరోగ్య సమస్యలను తెస్తుంది. అలాగే ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల గాయపడే అవకాశం ఉంది. కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం వ్యాపారంలో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవద్దు. మీ పనిలో వైఫల్యం చెందే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. 
పరిహారం (Remedy): కుజుడు-కేతువుల నవపంచం యోగం వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి కేతువు మరియు అంగారకుడి బీజ మంత్రాలను జపించండి. ఇది కాకుండా, మంగళవారం ఉపవాసం ఉండండి, అలాగే హనుమంతుడిని పూజించండి. 


Also Read: Guru Margi 2022: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ రాశులపై డబ్బు వర్షం కురవడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook