Guru Margi 2022: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ రాశులపై డబ్బు వర్షం కురవడం ఖాయం..

Guru Margi 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. బృహస్పతి దీపావళి తర్వాత ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2022, 04:16 PM IST
Guru Margi 2022: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ రాశులపై డబ్బు వర్షం కురవడం ఖాయం..

Guru Margi 2022: ఆస్ట్రాలజీలో బృహస్పతిని (Jupiter Planet) శుభగ్రహంగా పరిగణిస్తారు. అందుకే గురు సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. జ్ఞానం, విద్య, సంపదకు కారుకుడిగా బృహస్పతిని భావిస్తారు. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం గురుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 24 నుంచి మార్గంలోకి రానున్నాడు. దీని కారణంగా  'అఖండ సామ్రాజ్య యోగం' (Akhand Samrajya Yoga) ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఇందులో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి. 

గురుడు సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): బృహస్పతి అఖండ సామ్రాజ్య యోగం కారణంగా ఈ రాశివారు వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు వాహనం మరియు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీంతో మీరు భారీగా లాభాలు పొందుతారు. 
మిథునం (Gemini): ఈ రాశి వారికి బృహస్పతి సంచారం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులు, అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. పరిపాలనా, ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer): ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు. పోటీపరీక్షలకు సిద్దమవుతున్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది.

Also Read: Budh Gochar 2022: అక్టోబరు 26న తులరాశిలోకి బుధుడు.. ఈ రాశులకు అపారమైన ప్రయోజనం.. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Trending News