Planet Conjunction: డిసెంబర్ చివరిలో మకర రాశిలో మహాయోగం.. ఈ 3 రాశుల సుడి తిరగబోతోంది..
Grah Gochar 2023: ఈ నెల చివరిలో అంగారకుడు రాశిని మార్చి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో బృహస్పతి కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు.
Mangal Guru Gochar 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, కొన్ని గ్రహాలు స్నేహాపూర్వకంగా, మరికొన్ని గ్రహాలు శత్రువులుగానూ ఉంటాయి. మిత్ర గ్రహాలు కలిసినప్పుడు మంచి ఫలితాలను, శత్రు గ్రహాలు మీట్ అయినప్పుడు చెడు ఫలితాలను ఇస్తాయి. గ్రహాల కమాండరైన కుజుడు డిసెంబరు 27 రాత్రి 11:40 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ధనస్సు రాశిని బృహస్పతి పాలిస్తున్నాడు. పైగా అంగారకుడు, గురుడు స్నేహితులు. మరోవైపు కుజుడు మకర రాశి యెుక్క పన్నెండవ ఇంటిలో కూడా సంచరించబోతున్నాడు. దీని కారణంగా పరివర్తన యోగం ఏర్పడుతోంది. ఈ పరివర్తన యోగం వల్ల కొత్త సంవత్సరం ఏయే రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం.
మకర రాశి: ఇదే రాశిలో కుజుడు పరివర్తన యోగాన్ని సృష్టించబోతున్నాడు. దీని కారణంగా మీరు ఏ కార్యాన్ని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు విలువైనది కొనుగోలు చేస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది.
కర్కాటక రాశి: పరివర్తన యోగం వల్ల కర్కాటక రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉపాది లభిస్తుంది. ప్రస్తుతం జాబ్ చేస్తున్నవారికి అంతకన్నా పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
కుంభ రాశి: పరివర్తన యోగం వల్ల కుంభరాశి వారికి అదృష్టం పట్టనుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీరి లక్ష్యం నెరవేరుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: Lucky Zodiac Signs: న్యూ ఇయర్ లో అరుదైన యోగం.. 2024లో ఈ 4 రాశులవారికి గవర్నమెంట్ జాబ్ పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook