Mars Transit 2022: క్రమంగా నెల నెలకు ప్రతి గ్రహం తమ సొంత రాశులను వదిలి కొత్త రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే దీని ప్రభావవం పలు రాశులపై పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు.  అయితే ఈ నెలలో అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. ఈ ప్రభావవం  మొత్తం 12 రాశుల వారిపై పడుతుందని శాస్త్రం పేర్కొంది. ఈ క్రమంలో కొందరికి మంచి ఫలితాలు కలిగితే మరికొందరు అశుభ ఫలితాలు పొందుతారని శాస్త్రం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ రాశులవారిపై తీవ్ర ప్రభావవం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యాహ్నం 12:04 గంటల నుంచే అంగారక సంచారం మొదలైంది. 15 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 30 సాయంత్రం 06.19 గంటలకు తిరోగమన దశలోకి వస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని ప్రభావం దాదాపు నవంబర్ 13 వరకు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పలు రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు.
 
మేషం:
కుజుడి సంచారం వల్ల మిథునరాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. కాబట్టి వీరి జీవితంలో పలు మార్పులు జరగబోతున్నాయి. ఈ క్రమంలో వారు పని చేసే ఆఫీసుల్లో మంచి పేరును సంపాదించుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు మంచి పదవులు కూడా పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచారం వీరికి శుభ ప్రదంగా చెప్పొచ్చు.


వృషభం:
ఈ సంచారం వల్ల వృషభం రాశివారి ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు పెద్ద మొత్తంలో భారీగా పెడితే మంచి లాభాలను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వృషభం రాశి వారికి మిత్రుల సఫోర్ట్‌ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ క్రమంలో ఏం పని చేసిన లాభాలు పొందుతారు.  


సింహం:
ఈ క్రమంలో సింహం వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా మంచి అవకాశాలు పొందుతారు. వీరి ఈ నెల చివరిలోగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా రెండు వంతులుంటాయి. కాబట్టి తప్పకుండా డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో పలు రకాల చర్యలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.  వీరు శ్రమకు తగిన ఫలాలను పొందుతారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే, లాభాలను పొందే  అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.


కుంభ:
కుంభ రాశి వారు ఈ సంచారం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. ఈ రాశివారికి కుజుడు ఐదవ స్థానంలో ఉంటాడు. ముఖ్యంగా ఈ రాశివారు పిల్లలైతే విద్య, జ్ఞానంపై అసక్తి చూపుతారు. అయితే ఈ క్రమంలో కుంభ రాశి వారు పెట్టుబడుతు పెడితే భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు.


Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?


Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook