Mars Transit in Astrology:  జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని సోదరుడు, భూమి, శక్తి, ధైర్యం, శౌర్యం, శౌర్యానికి సూచికగా పరిగణిస్తారు. అయితే ఈ రోజు కన్యారాశిలోకి కుజుడు సంచారం చేయబోతున్నాడు. కుజుడు అన్ని గ్రహాలకు అధిపతి కూడా భావిస్తారు. ఈ సంచారంతో కొన్ని రాశులవారికి అశుభ ప్రభావం పడితే, మరికొన్ని రాశులవారిపై శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారు వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే కన్యారాశిలో కుజుడు సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

కుజుడి ప్రత్యేక ప్రభావం కారణంగా మేష రాశికి మనస్సు కలత ఏర్పడుతుంది. వీరు కోపాన్ని నియంత్రించుకుని, చర్చలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో ఉద్యోగ ఇంటర్వ్యూలు మొదలైన వాటిల్లో సులభంగా విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సోదరుల మద్దతు లభించి ఊహించని లాభాలు కలుగుతాయి. 


వృషభ రాశి:
కుజుడి సంచారం క్రమంలో వృషభ రాశివారు ఓపికతో ఉండడం చాలా మేలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోపాన్ని నియంత్రించుకుంటే ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి గౌరవం కూడా లభిస్తుంది. ఆదాయం పొందడానికి వీరు ఈ సమయంలో కొత్త మార్గాలు వెతుకుతారు. అయితే ఈ రాశివారు ఆరోగ్య విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశివారికి మాటల్లో సౌమత్య రెట్టింపు అవుతుంది. పని చేసే ప్రదేశాల్లో శ్రమ పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.  ఈ సమయంలో కార్యాలయంలో అనవసరమైన తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా వాహన సౌకర్య కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో తండ్రి నుంచి మద్దతు లభించి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.


కర్కాటక రాశి:
కుజుడి సంచార సమయంలో మనసు ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు మీపై మీకు పూర్తి విశ్వాసం పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మతం పట్ల భక్తి పెరుగుతుంది. దీంతో పాటు వీరు రాజకీయ నాయకులను కలిసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


మకర రాశి:
మకర రాశివారికి ఆశ, నిస్పృహలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి నుంచి కూడా సపోర్ట్‌ లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి