COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mars Transit 2023: గ్రహాల కదలికలు, సంచారాలు మేష రాశి నుంచి మీన రాశి వరకు ప్రభావం చూపుతాయి. కుజుడు జూలై 1వ తేదిన సింహరాశిలోకి సంచారం చేసింది. అయితే కుజుడు ఆగష్టు 18 వరకు అదే రాశిలో సంచార దశలో ఉండబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై తవ్ర ప్రభావం పడింది. అయితే ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు మంచి లాభాలు పొందితే మరికొన్ని రాశులవారికి ఊహించని దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మిథున రాశి:
మిథునరాశి వారికి బుధుడు  11వ, 6వ స్థానాలకి అధిపతిగా వ్యవహరిస్తున్నాడు.  దీని కారణంగా  ఈ రాశివారికి ధైర్యం పెరగడమే కాకుండా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా  ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ క్రమంలో మీరు ఎలాంటి పనులు చేసిన తండ్రి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది.


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


ధనుస్సు రాశి:
కుజుడి సంచారం ధనుస్సు రాశివారిపై కూడా తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఈ రాశివారు సంచారం కారణంగా యాత్రలు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తిలు కూడా ఈ సంచారం కారణంగా పొందే ఛాన్స్‌ ఉంది. ధనస్సు రాశివారు ఈ క్రమంలో వాహనం లేదా ఆస్తులు కూడా కొనుగోలు కూడా చేస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


మీన రాశి:
జూలై 1న మీన రాశిలోని 6వ స్థానంలో కుజుడు సంచారం చేశాడు. దీని కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సంచారం కారణంగా ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు కష్టపడి పని చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కూడా పొందుతారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లి చదువు కోవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా సమాజంలో గుర్తింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్నవారికి కూడా ఈ క్రమంలో భారీ లాభాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook