Mangal Gochar 2023 Effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. జూలై 01న కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 17 వరకు అదే రాశిలోఉండనున్నాడు. రాబోయే 36 రోజులుపాటు కొన్ని రాశులవారికి అంగారకుడు శుభఫలితాలను ఇవ్వనున్నాడు. కుజుడు అనుగ్రహం పొందే ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ 3 రాశులకు శుభప్రదం
మిధునరాశి
సింహరాశిలో కుజుడు సంచారం మిథునరాశి వారికి కలిసి రానుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్‌లో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అంగారకుని సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలను పొందుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీరు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. 
మీనరాశి
మీన రాశి వారికి రానున్న 36 రోజులు చాలా ప్రత్యేకం కానున్నాయి. అంగారకుడి సంచారం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు సంపదతోపాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీరు ఫారిన్ ట్రిప్ వెళ్లే అవకాశం ఉంది. మీన రాశి వారికి ఆనందం మరియు అదృష్టం లభిస్తుంది.


Also Read: Astrology: త్వరలో సింహరాశిలో అద్భుతమైన కలయిక.. ఈ రాశుల ఖజానా నిండటం పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook