హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంది. అదే సమయంలో నడక కూడా మారుతుంది. ఇప్పుడు 2023 ప్రారంభంలో సాహసం, పరాక్రమం, భూ సంపదలు, వివాహ కారకుడైన మంగళ గ్రహం సక్రమ మార్గం పట్టనున్నాడు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళగ్రహం వక్రమార్గంలో ఉంది. జనవరి 13, 2023న సరైన మార్గంలో రానుంది. మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం సక్రమ మార్గం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశులకు అత్యంత అదృష్టదాయకంగా ఉంటుంది. 2023లో మంగళ గ్రహం సక్రమ మార్గం కారణంగా ఏ రాశులకు లాభదాయకమో చూద్దాం.


కర్కాటక రాశి


మంగళ గ్రహం సక్రమ మార్గంలో రాగానే కర్కాటక రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. కష్టపడినదానికి పూర్తిగా ప్రతిఫలం దక్కుతుంది. ధనలాభం ఉంటుంది. గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. వ్యక్తిగత జీవితంలో ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుంది.


మకరరాశి


మంగళ గ్రహం సక్రమమార్గం కారణంగా మకరరాశి జాతకులకు చాలా ప్రయోజనకరం. చేసే పనిలో వృద్ధి చెందుతారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో పదోన్నతి ఇంక్రిమెంట్ లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం నుంచి కూడా లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.


కుంభరాశి


మంగళ గ్రహం చలనంలో మార్పు కారణంగా కుంభరాశి జాతకులకు చాలా లాభం కలుగుతుంది. ఉద్యోగస్థులకు గౌరవం లేదా అవార్డు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. భూమి ఆస్థులకు సంబంధించి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆస్థులకు సంబంధించి డీల్స్ బాగుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. 


మీనరాశి


మంగళగ్రహం సక్రమ మార్గంలో రావడంతో మీనరాశి జాతకులకు ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. కావల్సినచోటికి బదిలీలు జరుగుతాయి. వ్యాపారానికి మంచి అనువైన సమయం. పెళ్లికాని జాతకులకు బంధాలు కలుస్తాయి. దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది.


Also read: Ketu Gochar Impact 2023: కేతు గ్రహ సంచారం వల్ల ఒక్కసారిగా ఈ రాశిల వారి తల రాతలు మారబోతున్నాయి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook