Ketu Gochar Impact 2023: జోతిష్య శాస్త్రం ప్రకారం కేతవు ఎల్లప్పుడూ ఎదో ఒక దశలో తిరోగమనం చెందుతాడు. అయితే ఈ తిరోగమన దశకు 18 నుంచి 19 నెలల పాటు సమయం పడుతుంది. అంతేకాకుండా దీనిని కీలక దశ అని కూడా జోతిష్య శాస్త్రంలో అంటారు. అయితే ఏప్రిల్ నెలలో జరిగిన కేతు గ్రహం తిరోగమనం ప్రభావం ఇప్పటికీ ఉండడం వల్ల పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ గ్రహం ఈ నెలలో కన్యా రాశి వదిలి తులరాశిలోకి ప్రవేశించనుంది. దీంతో పలు రాశువారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు.
తిరోగమనం వల్ల ఈ రాశులవారిపై ప్రభావం:
మకరరాశి:
కేతు తిరోగమన ప్రభావం మకర రాశి వారిపై తీవ్ర పడబోతోందని సమాచారం. ఈ దశ వల్ల 2023 కొత్త సంవత్సరంలో మకరరాశి వారికి శ్రమ పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు ఇంట్లో శుభకార్యాలు జరుపుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి:
కేతువు గ్రహం సంచారం వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఈ రాశి వారు వాహనం లేదా భూమిని కోనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ ధనస్సు రాశి వారు ఈ క్రమంలో వ్యాపారాల్లో అధికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తిరోగమనం ప్రారంభ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
సింహరాశి:
సింహ రాశి వారికి కేతువు ప్రభావం వల్ల 2023 సంవత్సరంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఈ నెలలో చేసే ఏ పనుల్లోనైన సులభంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఆశించిన ఫలితాలు కూడా పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో సింహరాశి వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
వృషభ రాశి:
ఈ సంచార ప్రభావం వృషభ రాశి వారిపై కూడా పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కేతు సంచారం వల్ల వృషభరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేలకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయని జోతిష్య శాస్త్ర నిపుణుల సూచిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలలో చేసే పనులన్ని సులభంగా విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా వినే అవకాశాలున్నాయి.
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook