Mars Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం రాశి సంచారం చేయడం, కదలికల కారణంగా ప్రత్యేక ప్రభావంతో కొన్ని సార్లు యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో కుజుడు జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మార్చి 15వ తేదిన కుంభ రాశిలోకి సంచారం చేసిన కుజుడు ఏప్రిల్ చివరి వరకు అదే రాశిలో సంచార క్రమంలో ఉంటాడు. కుంభ రాశిలోకి కుజుడు సంచారం చేయడం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారికి కుజుడి ప్రత్యేక అనుగ్రహం:
వృషభ రాశి:

కుజుడు చేసిన ప్రత్యేక సంచారం కారణంగా వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనేక శుభవార్తలు వింటారు. అలాగే వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. దీంతో పాటు పిల్లల నుంచి కూడా గుడ్‌ న్యూస్‌ అందుకునే ఛాన్స్‌ ఉంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు విదేశీ పర్యటనలకు కూడా వెళ్లొచ్చు. అలాగే ఈ సమయంలో బాగా కష్టపడడం వల్ల ఊహించని డబ్బులు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. 


కుంభం రాశి:
కుజుడి సంచారం కారణంగా కుంభ రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా వీరు వ్యాపారాల్లో లాభాలు పొందడమే కాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు ఆఫీసులంలో కూడా మనుల్లో ప్రతిభ చూపి, ప్రసంశలు పొందే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.  


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


మిథునరాశి:    
కుంభరాశిలో కుజుడు ప్రవేశం మిథున రాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు బాగా పనులు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాలు కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు. అలాగే దాంపత్య జీవితంలో మధుర్యం పెరుగుతుంది. దీంతో మీ జీవిత భాగస్వామి అనుకున్న కోరికలు కూడా నెరవేర్చగలుగుతారు. దీంతో పాటు వీరికి ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి