Mars Transit in Cancer 2023 Makes Neechbhang Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చి శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇటీవల అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. కుజుడు కర్కాటక రాశిలో బలహీన స్థితిలో ఉంటాడు. ఈరాజయోగ ప్రబావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఈ నీచభంగ్ రాజయోగం వల్ల ఏయే రాశులవారికి మేలు చేయనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీచభంగ్ రాజయోగం ఈ  రాశులకు వరం


మేషరాశి
నీచభంగ్ రాజయోగం వల్ల మేషరాశి వారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఎందుకంటే కుజుడు మీ రాశి యెుక్క నాల్గో ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ లవ్ స్ట్రాంగ్ అవుతుంది. 


మీనరాశి
మీన రాశి వారికి నీచ భంగ్ రాజయోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈసమయంలో మీరు శుభవార్తలు వింటారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 


Also Read: Guru Gochar 2023: భరణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..


వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారు మంచి లాభాలను పొందురారు. మీ తొమ్మిదవ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలతోపాటు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.


Also Read: Rajyog: మిథునరాశిలో 'బుధాదిత్య రాజయోగం'.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook