Mars Transit Effect 2023: ఈనెలలో చాలా గ్రహాలు తమ రాశులను ఛేంజ్ చేశాయి. దీని ప్రభావం కొందరికి సానుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉంది. రీసెంట్ గా కుజుడు మిథునరాశిలో సంచరించాడు. అంగారకుడు 69 రోజులపాటు అదే రాశిలో ఉండబోతున్నాడు. మార్స్ యెుక్క రాశి మార్పు కొన్ని రాశులవారికి అనుకూల ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంగారక సంచారం ఈ రాశులకు వరం
సింహరాశి 
మిథునరాశిలో అంగారకుడి సంచారం సింహ రాశి వారి జీవితాల్లో పెను మార్పును తీసుకురాబోతోంది. ఈ సమయంలో మీరు మంచి లైఫ్ ను లీడ్ చేస్తారు. భారీగా ధనం సమకూరుతుంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధించారు. 
కన్య రాశి
కుజుడి రాశి మార్పు కన్యారాశి యెుక్క ధైర్యాన్ని పెంచుతుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ప్రతి పనిలో మిమ్మల్ని విజయలక్ష్మీ వరిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో పాటు ప్రమోషన్ లభిస్తుంది. 
తులారాశి
మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల తుల రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మీకు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీకు ప్రతి పనిలోనూ విజయం దక్కుతుంది. 


మకరరాశి
అంగారక సంచారం కారణంగా మీరు మీ శత్రువులను ఓడిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు మిత్రులు పెరుగుతారు. మీరు పోటీపరీక్షల్లో గెలుపొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. 
మీనరాశి
మీన రాశి వారికి అంగారక సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీకు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ల్యాండ్ ను ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. 


Also Read: Trigrahi Yogam: ఒకే రాశిలో మూడు గ్రహాల 'మహా సంగమం'.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook