Mars Transit In Gemini 2023: జ్యోతిషశాస్త్రంలో మంగళ దేవుడిని గ్రహల కమాండర్ అని పిలుస్తారు. ఇతడిని ధైర్యానికి కారకుడిగా భావిస్తారు. నూతన సంవత్సరంలో అంగారకుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు సంచారం (Mars Transit In Gemini 2023) వల్ల అన్ని రాశులవారు ప్రభావితులవుతారు. దీని ఎఫెక్ట్ కారణంగా మూడు రాశులవారు కెరీర్‌లో పురోగతి మరియు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం(Gemini); కుజ గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి చెందిన లగ్న గృహంలో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులు కొత్త జాబ్ ఆఫర్‌ను పొందుతారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. 


కన్య రాశిచక్రం (Virgo): అంగారకుడి సంచారం మీకు శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి 10వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న  చోటుకి బదిలీ అవుతారు. అంతేకాకుండా వీరు ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. 


మీన రాశిచక్రం (Pisces): మార్స్ యొక్క రాశి మర్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరించబోతున్నాడు. దీంతో మీరు సకల భౌతిక సుఖాలను పొందగలరు. మీరు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు విజయం సాధిస్తారు. బిజినెస్ బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు సూపర్ గా ఉంటుంది.


Also Read: Shani Dev: కుంభరాశిలో శనిదేవుడు ఉదయం... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook