Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో మంగళ  గ్రహానికి ప్రాశస్త్యత ఎక్కువే. మంగళ గ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు. సాహసం, శౌర్యం, పరాక్రమం, భూమి, వివాహాలకు కారకుడిగా ఈ గ్రహాన్ని పరిగణిస్తారు. మంగళ గ్రహం స్థితిలో పరివర్తనం వస్తే..మొత్తం 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సేనాపతిగా భావించే మంగళ గ్రహం శుక్రుడి రాశి తుల రాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో ముఖ్యంగా 3 రాశులకు అదృష్టం మారిపోనుంది. ఊహించని లాభాలు కలగనున్నాయి. ధన సంపదలు లభిస్తాయి. మంగళ గ్రహం కన్యా రాశిలో అక్టోబర్ 3 వరకూ ఉండి..అదే రోజు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ధనం, వైభవం, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. దీనివల్ల ఈ మూడు రాశులపై అపారమైన ధనలాభం కలగనుంది.


కన్యా రాశి జాతకులపై మంగళ గ్రహం గోచారం ప్రభావం ఆర్ధికంగా ప్రయోజనం కల్గించనుంది. ఊహించని మార్గాల్నించి ధనలాభం కలగడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులుండవు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. కెరీర్‌పరంగా చాలా అనువైన సమయం.  దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లబిస్తాయి.


మంగళ గ్రహం రాశి పరివర్తనంతో తులా రాశిలో ప్రవేశించడం వల్ల ఆ ప్రభావం వృశ్చిక రాశి జాతకులపై అద్భుతంగా ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. పాత పెట్టుబడులు లాభాల్ని ఆర్జిస్తాయి. ఆస్థి సంబంధిత పెండింగ్ పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.


మేష రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం శుభప్రదం కానుంది. మేష రాశి జాతకులకు ఈ సమయంలో కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. అదృష్టం తోడుగా ఉండటంతో అన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి. నిలిచిపోయిన పనులు సైతం పూర్తవుతాయి. ఉద్యోగస్థుల కెరీర్ బాగుంటుంది. వ్యాపారులకు చాలా అనువైన సమయం కావడంతో భారీగా లాభాలుంటాయి. ఆర్ధికంగా మంచి స్థితి కలిగి ఉంటారు.


Also read: Venus transit 2023: శుక్రుడి గమనంలో పెనుమార్పు.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook