Venus transit 2023: శుక్రుడి గమనంలో పెనుమార్పు.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..

Venus transit 2023: ఈరోజు శుక్రుడు కర్కాటక రాశిలో నేరుగా నడవనున్నాడు. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. శుక్రుడి గమనంలో మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 10:15 PM IST
Venus transit 2023: శుక్రుడి గమనంలో పెనుమార్పు.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..

Shukra Margi Gochar 2023: పురాణాల ప్రకారం, శుక్రుడిని రాక్షసుల గురువుగా భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇవాళ కర్కాటక రాశిలో నేరుగా నడవనున్నాడు. శుక్రుడి మార్గి నాలుగు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మకరరాశి
శుక్రుడు మార్గి మకరరాశి వారికి మేలు చేస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 
కర్కాటక రాశి
శుక్రుడు ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో వృద్ధి సాధిస్తారు. మీరు భారీగా డబ్బు కూడబెడతారు. మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో సడన్ గా తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. 

Also Read: Surya Gochar 2023: కన్యారాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

మేషరాశి
శుక్రుడు నేరుగా నడవడం వల్ల మేషరాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతున్నారు. మీరు  ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కన్య రాశి
శుక్రుడి గమనంలో మార్పు కన్యా రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది.

Also Read: Budh Uday 2023: సెప్టెంబర్ 15న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News