Ruchak Rajyog: త్వరలో అరుదైన రాజయోగం చేయబోతున్న కుజుడు.. దశ తిరగబోతున్న రాశులివే..
Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. త్వరలో కుజుడు రాశిలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
Benefits of Ruchak Rajyog: ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో తన రాశిని మారుస్తుంది. గ్రహాలు రాశులను మార్చడం ద్వారా రాజయోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల కమాండరైన అంగారకుడు నవంబర్‌లో తన సొంత రాశి అయిన వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన రుచక్ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు బెనిఫిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశి యెుక్క లగ్న గృహంలో రుచక్ రాజయోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా మీ దైర్య సాహసాలు పెరుగుతాయి. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీకు స్థిరచరాస్తులు లభిస్తాయి. మీకు లైఫ్ పార్టనర్ తో సత్సంబంధాలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకరరాశి
రుచక్ రాజయోగం మకరరాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే కర్మ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభించే అవకాశం ఉంది.
సింహరాశి
సింహ రాశి వారికి రుచక్ రాజయోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ రాశిచక్రం యొక్క నాల్గవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు విలువైనది ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. భూమి లేదా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభాలను పొందుతారు.
Also Read: Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో ఈ 4 రాశులవారికి కుబేర యోగం.. వీరు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook