Mars Transit 2023: నాలుగు రోజులు ఆగండి, ఈ 5 రాశులపై అపారమైన ధనవర్షం
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత, మహత్యమున్నాయి. అదే సమయంలో ఆ గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి పత్యేక మహత్యముంటుంది. కొన్ని గ్రహాల గోచారంతో ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Mars Transit 2023: హిందూమతంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉన్నట్టే మంగళ గ్రహాన్ని శుభగ్రహంగా పిలుస్తారు. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని గ్రహాలకు యవరాజుగా పిల్చినట్టే మంగళ గ్రహాన్ని సేనాపతిగా పరిగణిస్తారు. మంగళ గ్రహం కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టేనని చెప్పవచ్చు. మంగళ గ్రహం కన్యా రాశి ప్రవేశం ఎవరికి ఎలాంటి ప్రయోజనం కల్గించనుందో చూద్దాం..
హిందూమతం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అదే విధంగా గ్రహాల సేనాపతిగా భావించే మంగళ గ్రహాన్ని సాహసం, పరాక్రమం, పెళ్లి వంటి అంశాలకు కారకుడిగా పరిగణిస్తారు. అందుకే మంగళ గ్రహం రాశి పరివర్తనంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆగస్టు 18 వతేదీన అంటే మరో నాలుగు రోజుల్లో మంగళ గ్రహం కన్యారాశిలో ప్రవేశించనుంది. మంగళ గ్రహ గోచారం కొన్ని రాశులకు ముఖ్యంగా 5 రాశుల జాతకులకు అంతులేని ధనయోగం కల్గించనుంది. అదే సమయంలో గ్రహాల యువరాజుగా భావించే బుధుడు కూడా కన్యా రాశిలో ప్రవేశిస్తుండటంతో రెండు గ్రహాల కలయికతో యుతి ఏర్పడనుంది. స్ఖూలంగా చెప్పాలంటే మంగళ, బుధ గ్రహాల యుతి వల్ల కొన్ని రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి.
మంగళ గ్రహం గోచారం ప్రభావం కర్కాటక రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సాఫల్యం ఉంటుంది. ప్రత్యర్ధులు మిమ్మల్ని చూసి ఓటమి అంగీకరిస్తారు. ఊహించని మార్గాల్నించి ధనలాభం ఉండటంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి జాతకులకు మంగళ గ్రహం రాశి పరివర్తనం చెందడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారం విస్తృతమై లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. కుటుంబసభ్యులతో కూడా అధిక సమయం కేటాయిస్తారు. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు తలెత్తవు.
మేష రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం విశేషమైన లాభాల్ని ఆర్జిస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రతిసారీ ధైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఊహించని మార్గాల్నించి ధనలాభం ఉండటంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కోర్టులో నడిచే కేసులు మీకు అనుకూలంగా రావచ్చు. అందుకే సంయమనం పాటించడం మంచిది.
వృశ్చిక రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం కారణంగా ఎన్నాళ్ల నుంచో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా అప్పుల్నించి విముక్తి పొందుతారు. రోగాల్నించి ఉపశమనం పొందవచ్చు. మీకు సమయం ఎంత అనుకూలిస్తుందంటే మీ ప్రత్యర్ధులు సైతం స్నేహితులవుతారు. మీకు నలుగురిలో ఆదరణ పెరుగుతుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందడంతో ఆర్ధికంగా ఏ సమస్య ఉండదు.
ఇక మిదున రాశి జాతకులకు కూడా మంగళ గ్రహం గోచారం ప్రభావం విశేషమైన లాభాల్ని తెచ్చిపెడుతుంది. కుటుంబసభ్యులతో అధిక సమయం గడుపుతారు. ఇంట్లో ఏదైనా సమస్య ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంయమనంతో వ్యవహరిస్తే ఆ సమస్య పరిష్కారమౌతుంది. వ్యాపారస్థులకు వ్యాపారం విస్తృతమై లాభాలు పెరుగుతాయి. కెరీర్ కూడా బాగుంటుంది.
Also read: Sun-Saturn transit 2023: మరో మూడ్రోజుల్లో ఈ మూడు రాశులకు మహర్దశ, పట్టిందల్లా బంగారమేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook