Mangal Gochar 2023: వృషభంలో సంచరించనున్న అంగారకుడు... వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..

Mangal Gochar 2023: జనవరి 13న కుజుడు వృషభరాశిలో సంచరించబోతున్నాడు. అంగారకుడి యెుక్క రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Mangal Gochar 2023 Effect: ఈ నెల ప్రారంభంలో చాలా గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. జనవరిలో మూడు ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనుండగా.. మరో రెండు ఫ్లానెట్స్ ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాయి. వీటిలో ఒకటి అంగారకుడు. జనవరి 13న కజుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనుంది. దీని కారణంగా కొంత మంది జీవితాల్లో పెను మార్పు రానుంది. ధైర్యం, శక్తి, శౌర్యం, భూమి మెుదలైన వాటికి కారకుడిగా మార్స్ ను భావిస్తారు. జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. అంగారకుడి యెుక్క సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
సింహరాశి (Leo): అంగారకుడి సంచారం ఈ రాశి వారికి శుభవార్త అందించనుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులు సంక్రాంతి రోజు సంకల్పంతో పనిచేస్తే శుభ ఫలితాలు పొందుతారు. మీరు టెండర్ వేయడానికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి (Scorpio): కుజుడి సంచారం వృశ్చికరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ బిజెనెస్ విస్తరించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వచ్చి మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడటానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం.
వృషభం (Taurus): వృషభ రాశిలో కుజుడు సంచరించడం వల్ల వృషభరాశి వారికి మేలు జరుగుతుంది. మీరు కష్టపడి పనిచేస్తే అనుకున్న ఫలితాలను సాధిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సానుకూలత ఉంటుంది.
Also Read: Jupiter Planet: 'హన్స్ రాజయోగం' చేస్తున్న బృహస్పతి...ఈ రాశులకు ఊహించనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.