Jupiter Planet: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం మరియు కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహస్పతిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. ఫిబ్రవరి 1న గురుడు తన యవ్వనంలోకి అడుగుపెట్టబోతున్నాడు. గురు గ్రహం 12-18 డిగ్రీలు మధ్య ప్రయాణిస్తుంది. దీని కారణంగా అరుదైన హన్స్ రాజయోగం (Hans Rajyog) ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు శుభఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి వారికి యవ్వనంలో దేవగురువు బృహస్పతి ప్రవేశం వల్ల ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. బృహస్పతి మీ జాతకంలోని నాల్గో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది హన్స్ అనే రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం జీవితంలో పురోగతిని తీసుకువస్తుంది. ఈ సమయంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా ప్రయోజనాలను పొందుతారు మరియు ఉన్నత పదవిలో నియమించబడతారు.
మిధునరాశి (Gemini): బృహస్పతి మార్పు మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. గురుడు మీ జాతకం యొక్క కర్మ గృహంలోకి ప్రవేశిస్తాడు. దీంతో మిథున రాశి వారి ప్రతి పని విజయవంతమవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.
మీనరాశి (Pisces): దేవగురువు స్థానం మారడం వల్ల మీన రాశిలో హన్స్ అనే రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కెరీర్ పరంగా బృహస్పతి మార్పు చాలా శుభప్రదం కానుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
కన్య (Virgo): దేవగురువు యొక్క ఈ పరివర్తనతో కన్యా రాశి వారికి శుభవార్త అందుతుంది. బృహస్పతి తన గమనాన్ని మార్చుకుని కన్యారాశి జాతకంలోని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది రాజ్యోగాన్ని సృష్టిస్తుంది. ఇది జీవితంలో సానుకూల మార్పును తెస్తుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజంయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది.
Also read: Shukra Gochar 2023: అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. న్యూ ఇయర్ లో వీరి డబ్బు రెట్టింపు అవ్వడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.