Mauni Amavasya 2023 Date: మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అయితే హిందూ సంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. అయితే ఈ అమవాస్య రోజూ తల స్నానాలు చేసి దానాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా  మాఘ అమావాస్య రోజున మౌనంగా జపం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అందుకే చాలా మంది హిందువులు ఈ రోజూ దాన, ధర్మ కార్యక్రమాలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఈ ఏడాది జనవరి 21న మౌని అమావాస్య వస్తోంది. అయితే ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పనులు మాఘ అమావాస్య రోజు అస్సలు చేయకూడదు:
ఆలస్యంగా నిద్రపోకండి:

మౌని అమావాస్య రోజున ఆలస్యంగా అస్సలు నిద్ర పోకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాల్సి ఉంటుంది. అయితే తల స్నానం గంగా లేద నదుల్లో చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత సూర్యనికి అర్ఘ్యం సర్పించాల్సి ఉంటుంది.


శ్మశానవాటిక దగ్గరకు అస్సలు వెళ్లొద్దు:
అమావాస్య రోజు చిన్న పిల్లలతో శ్మశాన వాటిక లేదా దాని చుట్టూ అస్సలు తిరగకూడదు. అమావాస్య చీకటి రాత్రి సమయంలో దుష్టశక్తులు విచ్చల విడిగా తిరుగుతాయని నమ్ముతారు. కాబట్టి ఈ రోజు ఇంట్లోనే ఉండడం చాలా మంచిదని శాస్త్ర  నిపుణులు చెబుతున్నారు.


తగాదాలు మానుకోండి:
మాఘ అమావాస్య రోజున వస్తువులను దానం చేసిన తర్వాత ఇంట్లో పలు కారణాల వల్ల తగాదాలకు దిగడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు మనుషులను నొప్పించే మాటలు అస్సలు అనకూడదు.


ఉసిరి చెట్టును పూజించండి:
అమావాస్య రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం ఇలా చేయడం వల్ల మీ నుంచి కష్టాలన్ని దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మాంసాహారానికి దూరంగా ఉండండి:
మౌని అమావాస్య రోజు మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దాన, ధర్మ కార్యక్రమాలు చేసేవారు అస్సలు వాటిని ముట్టుకోకూడదని పూర్వీకులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిదని..అంతేకాకుండా ధ్యానం చేయడం చాలా మంచిది.


Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం


Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook