May 2024 Lucky Zodiac: కొన్ని గ్రహాలు దేవతలకు అధిపతిగా కూడా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇలాంటి గ్రహాల్లోనే బృహస్పతి నెంబర్ వన్. అందుకే ఈ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం మే 1వ తేదీన శుక్ర గ్రహం అధిపతిగా వ్యవహరించే వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి జ్ఞానం పెరగడమే కాకుండా అదృష్టం, వివాహం, సంతానం, సంపద కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభరాశిలో బృహస్పతి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక మార్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే బృహస్పతి సంచారంతో ఏయే రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

బృహస్పతి గ్రహ సంచారం కారణంగా మే 1వ తేది నుంచి మేష రాశివారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి సంచారం ప్రత్యేకమైన శుభస్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ లభించడమే కాకుండా కార్యాలయంలో గొప్ప ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వివాహానికి సంబంధించిన శుభ వార్తలు వింటారు. అలాగే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా గుడ్‌ న్యూస్‌ వినే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. 


వృషభ రాశి:
 బృహస్పతి వృషభరాశి రాశిలోకి సంచారం చేయడం కారణంగా కేరీర్‌కి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. దీంతో పాటు విపరీమైన ధన లాభాలు కూడా కలుగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే కఠిన పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. 


మిథునరాశి:
ఈ సంచారం మిథునరాశి వారికి కూడా చాలా శుభ్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరికి సానుకూల శక్తి లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా గుడ్‌ న్యూస్‌ వింటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో సీనియర్ల నుంచి ప్రశంసలు లభించి గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా కఠిన పనుల్లో కూడా వారి సపోర్ట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోంలో తలెత్తె సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారిపై కూడా బృహస్పతి సంచారం ప్రభావం పడుతుంది. దీని కారణంగా అనేక పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే భవిష్యత్‌కి సంబంధించిన పనుల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి