Guru Budh Gochar 2023: ఆస్ట్రాలజీలో మెర్క్యురీ మరియు బృహస్పతి కలయికను పవిత్రమైనదిగా భావిస్తారు.  రీసెంట్ గా బుధుడు మరియు గురుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించారు. బుధుడు మేధస్సుకు, బృహస్పతి జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. వీరిద్దరి కూటమి కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. వృషభం
బుధుడు మరియు బృహస్పతి కలయిక వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  మీకు తోబుట్టువుల సపోర్టు లభిస్తుంది. 
2. మిథునం
బుధ, గురుగ్రహ కలయిక వల్ల మిథున రాశి వారికి గౌరవాన్ని ఇస్తుంది.  మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ధన యోగం కలిగే అవకాశం ఉంది. సహోద్యోగులు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా శుభప్రదమైనది.
3. వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా మేలు చేస్తుంది. మీ సృజనాత్మక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇదే అనుకూల సమయం. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. 


4. ధనుస్సు
బుధుడు మరియు గురుగ్రహ కూటమి ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. మీ కెరీర్‌లో సానుకూల మార్పు ఉంటుంది. మీరు పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు. ధనలాభం కలిగే అవకాశం ఉంది. 
5. కుంభం
కుంభ రాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలనిస్తుంది. మీ ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులవుతారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విద్యా రంగానికి సంబంధించిన ప్రజలకు ఈ కూటమి మంచి ఫలితాలను ఇస్తుంది. 
6. మీనం
ఈ కూటమి మీన రాశి వారికి కెరీర్‌లో విజయాన్ని ఇస్తుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 


Also Read: Sun transit 2023: మేషరాశి ప్రవేశం చేయనున్న సూర్యుడు.. ఈ 4 రాశులకు లాభాలు బోలెడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook