Surya Gochar 2023: సూర్యుడిని 'కింగ్ ఆఫ్ ఫ్లానెట్స్' అంటారు. మీ జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే మీరు మీ కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆదిత్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. త్వరలో సూర్యభగవానుడు అంగారకుడి రాశి అయిన మేషరాశిలోకి ఏప్రిల్ 14న ప్రవేశించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇస్తుంది. సూర్యదేవుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి
సూర్యుని రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతలు తీసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ధనలాభం ఉంటుంది.
మిధునరాశి
సూర్య సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుని సంచారం మేలు చేస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ పనిని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు.
వృశ్చికరాశి
సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరీర్ లో అనుకున్న పురోగతిని సాధిస్తారు ఆదాయం రెట్టింపు అవుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Jupiter set 2023: రేపు మీనరాశిలో గురుడు అస్తమయం.. వచ్చే నెల రోజులపాటు ఈ 5 రాశులకు ఇబ్బందులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook