Mercury & Moon Conjunction in Taurus 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. అలాగే చంద్రుడు కూడా తన రాశిచక్రాన్ని మారుస్తాడు. ఒక్కో రాశిలో చంద్రుడు రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. జూన్ 15వ తేదీ రాత్రి 8.23 ​​గంటలకు చంద్రుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో శుక్రుడి రాశిలో బుధుడు-శుక్రుడు కలయిక ఏర్పడింది. బుధుడిని తర్కం, విచక్షణ, జ్ఞానం, వ్యాపారం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తే.. చంద్రుడిని మనస్సుకు సంబంధించిన వాడిగా పరిగణిస్తారు. ఈ గ్రహాల సంయోగం ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
ఇదే రాశిలో బుధుడు మరియు చంద్రుడు కలయిక ఏర్పడింది. దీంతో మీకు ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు మంచి మంచి ఆఫర్లు రావచ్చు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు. 


కన్య రాశి
ఈ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో బుధుడు ఉన్నాడు. దీంతో కన్యారాశి వారు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ డబ్బును పొదుపు చేస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.


Also Read: Sun transit 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?


మకరరాశి
ఈ రాశి వారి జాతకంలో ఐదో ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడి లాభాలను ఇస్తుంది. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. 


Also Read: Surya Gochar 2023: బుధుడి రాశిలో సూర్యుడి ప్రవేశం.. ఈ 4 రాశులవారు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి