Benefits of Budhaditya Yog 2023: ప్రతి గ్రహం కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. మే 15న సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మరోవైపు గ్రహాల యువరాజు మెర్క్యూరీ జూన్ 07న ఇదే రాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో బుధాదిత్య యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. బుధాదిత్య యోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య యోగం ఈ రాశులకు వరం
కుంభ రాశి
సూర్యుడు మరియు బుధ గ్రహాల కలయిక కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు స్థిర చరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీపై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. 
మీనరాశి
బుధాదిత్య యోగం వల్ల మీనరాశి వారికి ధనలాభం ఉంటుంది. మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
కన్య రాశి
బుధాదిత్య యోగం వల్ల కన్యారాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగం మారడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 


Also read: Mercury transit In June 2023: జూన్‌లో ఈ 2 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook